Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

మోహిని భస్మాసుర నాటకానికి ప్రేక్షకుల నీరాజనం

Author
Posted By News Desk
| 03 Nov 2026, 09:18 AM | వార్తలు
మోహిని భస్మాసుర నాటకానికి ప్రేక్షకుల నీరాజనం

శ్రీనివాస సిరి నాట్య కళామండలి ఆధ్వర్యంలో ‘మోహిని భస్మాసుర’ పౌరాణిక పద్య నాటక ప్రదర్శన ఘనంగా నిర్వహించారు. కళామండలి వార్షికోత్సవం, దసరా బతుకమ్మ ఉత్సవాలను పురస్కరించుకుని, తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ సౌజన్యంతో చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ముద్దెన పంచనాదం రచించిన నాటకంలో కళాకారులు తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. విష్ణుమూర్తిగా సిరిగిరి రామాచారి, నారదుడిగా సంపంగి కృష్ణ, భస్మాసురుడిగా పి. మోహాపారావు, శంకరుడిగా జి. అంజయ్య గౌడ్, మోహినిగా సురభి జ్యోతి, లక్ష్మిగా సురభి ప్రియాంక నటించారు. వి. మాధవరాజు పద్యాలకు రాగాలు సమకూర్చగా, బ్రహ్మం తబలా, కీబోర్డుతో సంగీత సహకారం అందించారు. పౌరాణిక నాటక రంగ అభివృద్ధికి సిరిగిరి రామాచారి చేస్తున్న కృషిని అతిథులు అభినందించారు. కార్యక్రమంలో పోరెడ్డి శ్రీనివాసరెడ్డి, యాదిరెడ్డి, కళ్లెం మురళీధర్‌రెడ్డి, వడ్ల రమేష్ చారి (షాద్‌నగర్, రంగారెడ్డి జిల్లా రంగస్థల కళాకారుల అభిమాన సమాఖ్య ప్రధాన కార్యదర్శి) తదితరులు పాల్గొన్నారు. కళాకారుల ప్రతిభను ప్రేక్షకులు అభినందించారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి