మోహిని భస్మాసుర నాటకానికి ప్రేక్షకుల నీరాజనం
శ్రీనివాస సిరి నాట్య కళామండలి ఆధ్వర్యంలో ‘మోహిని భస్మాసుర’ పౌరాణిక పద్య నాటక ప్రదర్శన ఘనంగా నిర్వహించారు. కళామండలి వార్షికోత్సవం, దసరా బతుకమ్మ ఉత్సవాలను పురస్కరించుకుని, తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ సౌజన్యంతో చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ముద్దెన పంచనాదం రచించిన నాటకంలో కళాకారులు తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. విష్ణుమూర్తిగా సిరిగిరి రామాచారి, నారదుడిగా సంపంగి కృష్ణ, భస్మాసురుడిగా పి. మోహాపారావు, శంకరుడిగా జి. అంజయ్య గౌడ్, మోహినిగా సురభి జ్యోతి, లక్ష్మిగా సురభి ప్రియాంక నటించారు. వి. మాధవరాజు పద్యాలకు రాగాలు సమకూర్చగా, బ్రహ్మం తబలా, కీబోర్డుతో సంగీత సహకారం అందించారు. పౌరాణిక నాటక రంగ...