Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

మోత్కూల గూడలో బీరప్ప స్వామి ఆలయ స్లాబ్ పనులు ప్రారంభం

Author
Posted By News Desk
| 30 Oct 2026, 08:24 AM | వార్తలు
మోత్కూల గూడలో బీరప్ప స్వామి ఆలయ స్లాబ్ పనులు ప్రారంభం

నందిగామ మండలం మోత్కూల గూడ గ్రామంలోని శ్రీ బీరప్ప స్వామి దేవాలయానికి స్లాబ్ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కుల పెద్దలు, కురువ సంఘం పెద్దలు, సంఘం సభ్యులు కలిసి కొబ్బరికాయ కొట్టి పనులకు శ్రీకారం చుట్టారు. స్వామివారి ఆశీస్సులతో ఆలయ నిర్మాణ పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తికావాలని ఆకాంక్షించారు.గ్రామంలో బీరప్ప స్వామి దేవాలయానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉందని, ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమవంతు సహకారం అందించాలని ఈ సందర్భంగా పలువురు కోరారు. భక్తులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా ఆలయ నిర్మాణ పనులను ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుల పెద్దలు, కురువ సంఘం నాయకులు, సభ్యులు పాల్గొని నిర్మాణ పనుల ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేశారు. ఆలయ అభివృద్ధి కోసం సంఘ సభ్యులు ఐక్యంగా ముందుకు రావడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. శ్రీ బీరప్ప స్వామి వారి కృప గ్రామ ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి