Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

గర్భిణీ రాధ మృతిపై ఆగ్రహం.. వైద్యుల నిర్లక్ష్యంపై సమగ్ర విచారణ చేపట్టాలి. జంగారి రవి

Author
Posted By TELANGANA PRAJA GARJANA
| 02 Nov 2026, 03:38 PM | రాజకీయం
గర్భిణీ రాధ మృతిపై ఆగ్రహం.. వైద్యుల నిర్లక్ష్యంపై సమగ్ర విచారణ చేపట్టాలి. జంగారి రవి

గర్భిణీ రాధ మృతిపై ఆగ్రహం..

వైద్యుల నిర్లక్ష్యంపై సమగ్ర విచారణ చేపట్టాలి

సీపీఎం జిల్లా నాయకులు రాజు, కాంగ్రెస్స్ పార్టీ ఎస్సీ విభాగంనియోజక వర్గం చైర్మెన్ జాంగారి రవి

తెలంగాణ పంచాయతీ రాజ్ చాంబర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాధే పల్లి సిద్దార్థ

కాంగ్రెస్ యువ నాయకులు సింగపగా అనిల్



షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి వివరాలు సేకరించిన సీపీఎం, కాంగ్రెస్ నాయకులు



బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్.. బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి



షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ మహిళ రాధ మృతి ఘటనపై వివిధ రాజకీయ పార్టీల నాయకులు స్పందించారు. వైద్యుల నిర్లక్ష్యమే ఆమె మృతికి కారణమనే ఆరోపణల నేపథ్యంలో సోమవారం ఉదయం సీపీఎం జిల్లా నాయకులు రాజు, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం నియోజకవర్గ చైర్మన్ జాంగారి రవి, తెలంగాణ పంచాయతీరాజ్ చాంబర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాధేపల్లి సిద్ధార్థ, కాంగ్రెస్ యువ నాయకుడు సింగపాగ అనిల్ కుమార్, ఎస్ఎఫ్ఐ నాయకుడు వడ్ల శ్రీకాంత్ తదితరులు షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలోని పరిస్థితులను పరిశీలించి, ఆసుపత్రి సూపరింటెండెంట్ విష్ణువర్ధన్ ను కలిసి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జాంగారి రవి మాట్లాడుతూ.. వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన దళిత పేద కుటుంబానికి చెందిన గర్భిణీ మహిళ రాధ ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినట్లు తేలితే బాధ్యులైన వైద్యులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను కోరారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు, అత్యవసర చికిత్స అందేలా ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.సీపీఎం జిల్లా నాయకులు రాజు మాట్లాడుతూ.. ఈ ఘటనపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ జరపాలని కోరారు. రాధ మృతికి గల అసలు కారణాలను వెల్లడించాలని, ఘటనకు సంబంధించి ఎలాంటి అనుమానాలకు తావులేకుండా నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పంచాయతీరాజ్ చాంబర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాధేపల్లి సిద్ధార్థ మాట్లాడుతూ.. ఘటన సమయంలో విధుల్లో ఉన్న వైద్యులు, సిబ్బంది పాత్రపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని, నిర్లక్ష్యం నిర్ధారణ అయితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎస్ఎఫ్ఐ నాయకుడు వడ్ల శ్రీకాంత్ మాట్లాడుతూ.. మృతురాలి కుటుంబానికి ప్రభుత్వం తగిన ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని కోరారు. ఇలాంటి విషాదకర ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలను మెరుగుపరచాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యను స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ దృష్టికి తీసుకెళ్లి, ఆసుపత్రిలో నెలకొన్న పరిస్థితులను వివరించనున్నట్లు జాంగారి రవి తెలిపారు. ఈ కార్యక్రమంలో కొందుర్గు కాంగ్రెస్ ఎస్సీ విభాగం అధ్యక్షుడు, చెరుకుపల్లి సర్పంచ్ మల్లని యాదయ్య, ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి గడ్డం జంగయ్య, కావాలి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి