Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఏపీకి షాద్‌నగర్ విద్యుత్ సిబ్బంది అండ

Author
Posted By TELANGANA PRAJA GARJANA
| 31 Oct 2026, 11:15 AM | రాజకీయం
ఏపీకి షాద్‌నగర్ విద్యుత్ సిబ్బంది అండ

ఏపీకి షాద్‌నగర్ విద్యుత్ సిబ్బంది అండ

తుఫాను బీభత్సంతో దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థ పునరుద్ధరణకు నాలుగు బృందాలు

45 మంది సిబ్బందితో సహాయక చర్యలకు తరలింపు

అర్నాబ్ తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో 16 వేలకుపైగా విద్యుత్ స్తంభాలు దెబ్బతినడంతో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో బాధిత ప్రాంతాల్లో విద్యుత్ సేవలను త్వరితగతిన పునరుద్ధరించేందుకు షాద్‌నగర్ విద్యుత్ శాఖ సిబ్బంది ముందుకొచ్చారు.షాద్‌నగర్ డివిజన్ నుంచి సుమారు 45 మంది సిబ్బందితో కూడిన నాలుగు ప్రత్యేక బృందాలు ఏపీకి బయలుదేరాయి. దెబ్బతిన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతులు చేపట్టి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంలో ఈ బృందాలు సేవలందించనున్నాయి.ప్రకృతి వైపరీత్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు విద్యుత్ సేవలు అందించేందుకు షాద్‌నగర్ సిబ్బంది పొరుగు రాష్ట్రానికి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.రాజేంద్రనగర్ సర్కిల్‌కు చెందిన షాద్‌నగర్ డివిజన్ డీఈ శ్యామ్‌సుందర్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏడీఈలు సత్యనారాయణ, రవీందర్, ఏఈలు, ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి