Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

మెప్మా అదనపు సంచాలకుడిపై ఏసీబీ దాడులు.. రూ.4.75 కోట్ల అక్రమాస్తుల గుర్తింపు

Author
Posted By TELANGANA PRAJA GARJANA
| 03 Nov 2026, 10:06 PM | క్రైమ్

మెప్మా అదనపు సంచాలకుడిపై ఏసీబీ దాడులు..

10 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.. రూ.4.75 కోట్ల ఆస్తుల గుర్తింపు.

ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై మెప్మా (మున్సిపల్ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన సంస్థ) అదనపు సంచాలకుడు సయ్యద్ యాదగిరి రావు నల్లగుంటపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. తెలంగాణలోని 10 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఆయన నివాసం, కార్యాలయం, బ్యాంకు లాకర్లు, బంధువులు, సన్నిహితులు, బినామీలకు చెందిన ఆస్తులపై తనిఖీలు చేశారు. ఇప్పటివరకు మొత్తం రూ.4.75 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించినట్లు ఏసీబీ వెల్లడించింది.స్థిరాస్తులు.. రూ.2.90 కోట్లకుపైగా...

సోదాల్లో హైదరాబాద్‌, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో 12 ఖాళీ స్థలాలకు సంబంధించిన పత్రాలను అధికారులు గుర్తించారు. వీటి ప్రభుత్వ విలువ రూ.58.63 లక్షలుగా ఉంది. ఉప్పల్‌లో రూ.31.36 లక్షల విలువైన రెండు నివాస ఫ్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. అదే ప్రాంతంలో జీ+3 అంతస్తులతో పాటు పెంట్‌హౌస్‌ కలిగిన మరో భవనాన్ని గుర్తించారు. దీని విలువ సుమారు రూ.2 కోట్లుగా అంచనా వేశారు. సూర్యాపేట జిల్లాలో రూ.4.75 లక్షల విలువైన ఆర్‌సీసీ పైకప్పు ఇల్లు, ఉప్పల్‌లో రూ.1.06 లక్షల విలువైన వాణిజ్య దుకాణం ఉన్నట్లు గుర్తించారు. ఈ ఆస్తుల బహిరంగ మార్కెట్‌ విలువ ప్రభుత్వ లెక్కల కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం...

తనిఖీల్లో సుమారు 1,792.2 గ్రాముల బంగారు ఆభరణాలు గుర్తించారు. వీటి విలువ రూ.33.82 లక్షలుగా అంచనా వేశారు. అలాగే మూడు కిలోల వెండి ఆభరణాలు, వస్తువులు గుర్తించగా వాటి విలువ రూ.1.80 లక్షలుగా లెక్కించారు. టయోటా ఫార్చ్యూనర్‌తో పాటు మరో కారు విలువ రూ.73 లక్షలుగా, మూడు ద్విచక్ర వాహనాల విలువ రూ.2.80 లక్షలుగా గుర్తించారు.

బ్యాంకు ఖాతాల్లో రూ.32.30 లక్షలు..

ఇంటి సామగ్రి విలువ రూ.29.08 లక్షలు, ఎలక్ట్రానిక్‌ పరికరాల విలువ రూ.7.01 లక్షలుగా గుర్తించారు. వివిధ బ్యాంకు ఖాతాల్లో రూ.32.30 లక్షల నగదు నిల్వలు ఉన్నట్లు తనిఖీల్లో వెల్లడైంది. ఇప్పటివరకు గుర్తించిన స్థిర, చరాస్తుల మొత్తం విలువ రూ.4,75,61,171 (సుమారు రూ.4.75 కోట్లు)గా ఏసీబీ ప్రకటించింది. మరికొన్ని ఆస్తులకు సంబంధించిన వివరాల పరిశీలన కొనసాగుతోందని తెలిపింది.అవినీతి నిరోధక చట్టం-1988లో 2018 సవరణ అనంతరం అమల్లోకి వచ్చిన 13(1)(బి), 13(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందిత అధికారిని హైదరాబాద్‌లోని ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచి న్యాయ రిమాండ్‌కు తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. అదనపు ఆస్తుల వివరాలపై తనిఖీలు, దర్యాప్తు కొనసాగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి