మెప్మా అదనపు సంచాలకుడిపై ఏసీబీ దాడులు.. రూ.4.75 కోట్ల అక్రమాస్తుల గుర్తింపు
మెప్మా అదనపు సంచాలకుడిపై ఏసీబీ దాడులు.. 10 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు.. రూ.4.75 కోట్ల ఆస్తుల గుర్తింపు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై మెప్మా (మున్సిపల్ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన సంస్థ) అదనపు సంచాలకుడు సయ్యద్ యాదగిరి రావు నల్లగుంటపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. తెలంగాణలోని 10 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఆయన నివాసం, కార్యాలయం, బ్యాంకు లాకర్లు, బంధువులు, సన్నిహితులు, బినామీలకు చెందిన ఆస్తులపై తనిఖీలు చేశారు. ఇప్పటివరకు మొత్తం రూ.4.75 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించినట్లు ఏసీబీ వెల్లడించింది.స్థిరాస్తులు.. రూ.2.90 కోట్లకుపైగా... సోదాల్లో హైదరాబాద్, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో 12 ఖాళీ స్థలాలకు...