Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

కల్వకుర్తి మిల్లులో ధాన్యం మాయం! రూ.25 కోట్ల ప్రభుత్వ ధాన్యానికి లెక్కలేవి? 8,505 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొరత గుర్తింపు.. మిల్లు నిర్వాహకులపై కేసు నమోదు

Author
Posted By TELANGANA PRAJA GARJANA
| 03 Nov 2026, 05:20 PM | తెలంగాణ
కల్వకుర్తి మిల్లులో ధాన్యం మాయం!  రూ.25 కోట్ల ప్రభుత్వ ధాన్యానికి లెక్కలేవి?  8,505 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొరత గుర్తింపు.. మిల్లు నిర్వాహకులపై కేసు నమోదు

కల్వకుర్తి, నవంబరు 03 (తెలంగాణ ప్రజాగర్జన న్యూస్): కల్వకుర్తిలో ప్రభుత్వ ధాన్యం నిల్వల్లో భారీ కొరత వెలుగుచూసింది. పట్టణంలోని రఘుపతిపేట రోడ్డులో ఉన్న శ్రీ సాయి లక్ష్మీ వెంకటేశ్వర ఉప్పుడు బియ్యం మిల్లులో సుమారు రూ.25 కోట్ల విలువైన ప్రభుత్వ ధాన్యం లెక్కల్లో తేడా ఉన్నట్లు అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. మొత్తం 8,505.586 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొరత ఉన్నట్లు గుర్తించిన అధికారులు, దాని విలువను రూ.25,04,42,985గా నిర్ధారించారు. నవంబరు 2న జిల్లా పౌరసరఫరాల శాఖ, నిఘా, అమలు విభాగం అధికారులు సంయుక్తంగా మిల్లులో తనిఖీలు నిర్వహించగా ఈ భారీ వ్యత్యాసం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వం అప్పగించిన ధాన్యాన్ని ఒప్పంద నిబంధనలకు విరుద్ధంగా దుర్వినియోగం చేసి ప్రభుత్వానికి ఆర్థిక నష్టం కలిగించినట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్‌ దండు రాజేందర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కల్వకుర్తి పోలీస్‌స్టేషన్‌లో నేర సంఖ్య 388/2026గా కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహితలోని 316(2), 316(5), 318(3) సెక్షన్లతో పాటు నిత్యావసర సరుకుల చట్టంలోని సెక్షన్‌ 7 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇంత భారీ మొత్తంలో ప్రభుత్వ ధాన్యం నిల్వల్లో కొరత ఏర్పడటానికి గల కారణాలు ఏమిటి? ధాన్యం ఎక్కడికి తరలించారు? ఈ వ్యవహారంలో ఇంకా ఎవరైనా ప్రమేయం ఉందా? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు విచారణలో వెల్లడికావాల్సి ఉంది.

కల్వకుర్తి మిల్లులో ధాన్యం మాయం!  రూ.25 కోట్ల ప్రభుత్వ ధాన్యానికి లెక్కలేవి?  8,505 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొరత గుర్తింపు.. మిల్లు నిర్వాహకులపై కేసు నమోదు - Additional Image
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: