కల్వకుర్తి మిల్లులో ధాన్యం మాయం! రూ.25 కోట్ల ప్రభుత్వ ధాన్యానికి లెక్కలేవి? 8,505 మెట్రిక్ టన్నుల ధాన్యం కొరత గుర్తింపు.. మిల్లు నిర్వాహకులపై కేసు నమోదు
కల్వకుర్తి, నవంబరు 03 (తెలంగాణ ప్రజాగర్జన న్యూస్): కల్వకుర్తిలో ప్రభుత్వ ధాన్యం నిల్వల్లో భారీ కొరత వెలుగుచూసింది. పట్టణంలోని రఘుపతిపేట రోడ్డులో ఉన్న శ్రీ సాయి లక్ష్మీ వెంకటేశ్వర ఉప్పుడు బియ్యం మిల్లులో సుమారు రూ.25 కోట్ల విలువైన ప్రభుత్వ ధాన్యం లెక్కల్లో తేడా ఉన్నట్లు అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. మొత్తం 8,505.586 మెట్రిక్ టన్నుల ధాన్యం కొరత ఉన్నట్లు గుర్తించిన అధికారులు, దాని విలువను రూ.25,04,42,985గా నిర్ధారించారు. నవంబరు 2న జిల్లా పౌరసరఫరాల శాఖ, నిఘా, అమలు విభాగం అధికారులు సంయుక్తంగా మిల్లులో తనిఖీలు నిర్వహించగా ఈ భారీ వ్యత్యాసం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వం అప్పగించిన ధాన్యాన్ని ఒప్పంద నిబంధనలకు విరుద్ధంగా దుర్వినియోగం చేసి...