Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ప్రాణాలకు తెగించి ప్రయాణికులను కాపాడిన భారత పైలట్‌ మచ్చర్‌కు యూఏఈ అత్యున్నత గౌరవం హైజాక్‌ యత్నాన్ని ధైర్యంగా అడ్డుకున్న వైనం పైలట్‌ సాహసానికి అంతర్జాతీయ గుర్తింపు

Author
Posted By TELANGANA PRAJA GARJANA
| 28 Oct 2026, 08:01 AM | తెలంగాణ
ప్రాణాలకు తెగించి ప్రయాణికులను కాపాడిన భారత పైలట్‌ మచ్చర్‌కు యూఏఈ అత్యున్నత గౌరవం  హైజాక్‌ యత్నాన్ని ధైర్యంగా అడ్డుకున్న వైనం పైలట్‌ సాహసానికి అంతర్జాతీయ గుర్తింపు

తెలంగాణ ప్రజాగర్జన| అంతర్జాతీయ వార్తలు//విమానం హైజాక్‌ యత్నాన్ని ధైర్యసాహసాలతో ఎదుర్కొని ప్రయాణికుల భద్రతకు కృషి చేసిన ఫ్లై దుబాయ్‌ పైలట్‌ స్మిత్‌ మచ్చర్‌కు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) అత్యున్నత గౌరవాన్ని అందించింది. యూఏఈ అధ్యక్షుడు షేక్‌ మహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ తరఫున ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. విధి నిర్వహణలో నిబద్ధత, విపత్కర పరిస్థితుల్లో ప్రదర్శించిన ధైర్యసాహసాలకు గుర్తింపుగా ఈ సత్కారం లభించింది. దుబాయ్‌ నుంచి ఇజ్రాయెల్‌కు వెళ్తున్న విమానంలో సహ పైలట్‌ దాడి చేయడంతో మచ్చర్‌ తీవ్రంగా గాయపడ్డారు. అయినప్పటికీ పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొని హైజాక్‌ యత్నాన్ని అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించారు. అనంతరం విమానాన్ని సురక్షితంగా దించడంతో ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలు కాపాడగలిగారు. ఈ ఘటనపై స్పందించిన ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు కూడా మచ్చర్‌ ధైర్యసాహసాలను ప్రశంసించి తమ దేశ పౌర సాహస పురస్కారంతో గౌరవించనున్నట్లు ప్రకటించారు. భారతీయ పైలట్‌ సాహసానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం గర్వకారణంగా నిలిచింది.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: