ప్రాణాలకు తెగించి ప్రయాణికులను కాపాడిన భారత పైలట్ మచ్చర్‌కు యూఏఈ అత్యున్నత గౌరవం హైజాక్ యత్నాన్ని ధైర్యంగా అడ్డుకున్న వైనం పైలట్ సాహసానికి అంతర్జాతీయ గుర్తింపు
తెలంగాణ ప్రజాగర్జన| అంతర్జాతీయ వార్తలు//విమానం హైజాక్ యత్నాన్ని ధైర్యసాహసాలతో ఎదుర్కొని ప్రయాణికుల భద్రతకు కృషి చేసిన ఫ్లై దుబాయ్ పైలట్ స్మిత్ మచ్చర్‌కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అత్యున్నత గౌరవాన్ని అందించింది. యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తరఫున ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. విధి నిర్వహణలో నిబద్ధత, విపత్కర పరిస్థితుల్లో ప్రదర్శించిన ధైర్యసాహసాలకు గుర్తింపుగా ఈ సత్కారం లభించింది. దుబాయ్ నుంచి ఇజ్రాయెల్‌కు వెళ్తున్న విమానంలో సహ పైలట్ దాడి చేయడంతో మచ్చర్ తీవ్రంగా గాయపడ్డారు. అయినప్పటికీ పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొని హైజాక్ యత్నాన్ని అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషించారు. అనంతరం విమానాన్ని సురక్షితంగా దించడంతో ప్రయాణికులు,...