Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి జీతాల బకాయిలు, విధుల్లోకి తీసుకోవాలని అధికారులతో వనంపల్లి జైపాల్ రెడ్డి చర్చలు

Author
Posted By TELANGANA PRAJA GARJANA
| 04 Nov 2026, 07:11 PM | తెలంగాణ
మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి  జీతాల బకాయిలు, విధుల్లోకి తీసుకోవాలని అధికారులతో వనంపల్లి జైపాల్ రెడ్డి చర్చలు

(తెలంగాణ ప్రజాగర్జన)నార్సింగ్, నవంబర్ 4: నార్సింగ్ మున్సిపల్ సర్కిల్ పరిధిలోని నార్సింగ్ చౌరస్తాలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి మున్సిపల్ కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామపంచాయతీగా ఉన్న సమయంలో తమ సమస్యలను పరిష్కరించిన మీరు ప్రస్తుతం అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యల పరిష్కారానికి మరోసారి చొరవ తీసుకోవాలని కోరారు. దీనిపై స్పందించిన జైపాల్ రెడ్డి శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్‌కు ఒక నెల జీతం అందక ఇబ్బంది పడుతున్న విషయాన్ని మున్సిపల్ అధికారులతో మాట్లాడి జీతం ఇప్పించినట్లు తెలిపారు. విధులకు హాజరుకాని వరప్రసాద్ అనే కార్మికుడిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కూడా అధికారులతో ఫోన్‌లో మాట్లాడగా, పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. కార్మికుల హక్కులు, సమస్యల పరిష్కారం కోసం యూనియన్‌లో చేరి ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. తాము మీ వెంటే ఉంటామని కార్మికులు హామీ ఇచ్చారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: