Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం..ప్రసవానికి వచ్చిన గర్భిణీ, కడుపులోని శిశువు మృతి

Author
Posted By TELANGANA PRAJA GARJANA
| 30 Oct 2026, 11:09 PM | Array
షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం..ప్రసవానికి వచ్చిన గర్భిణీ, కడుపులోని శిశువు మృతి

షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం..

ప్రసవానికి వచ్చిన గర్భిణీ, కడుపులోని శిశువు మృతి

వైద్య సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని భర్త ఆరోపణ..

సమగ్ర విచారణకు ఎమ్మార్పీఎస్ నాయకుడు ఆనేగాళ్ల ఆనంద్ మాదిగ డిమాండ్



షాద్ నగర్, అక్టోబర్ 30,తెలంగాణ ప్రజా గర్జన :–



రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రసవం కోసం ఆసుపత్రికి వచ్చిన గర్భిణీతో పాటు కడుపులోని శిశువు మృతి చెందడం కలకలం రేపింది. కొందుర్గ్ మండలం చెరుకుపల్లి గ్రామానికి చెందిన రమేష్ కుమార్, రాధా దంపతులకు ఈ విషాదం ఎదురైంది.మొదట కొందుర్గ్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లగా, అక్కడి నుంచి షాద్‌నగర్‌కు పంపించినట్లు బాధిత కుటుంబం తెలిపింది. షాద్‌నగర్ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది సకాలంలో స్పందించకపోవడం, సరైన వైద్యం అందకపోవడమే మృతికి కారణమని భర్త రమేష్ కుమార్ ఆరోపించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించగా అప్పటికే తల్లీబిడ్డ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారని తెలిపారు.ఈ ఘటనపై ఎమ్మార్పీఎస్ కొందుర్గ్ మండల సీనియర్ నాయకుడు ఆనేగాళ్ల ఆనంద్ మాదిగ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సమగ్ర విచారణ జరిపించాలని, నిర్లక్ష్యం నిర్ధారణ అయితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి తగిన ఆర్థిక సహాయం అందించాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో గర్భిణులకు అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.వైద్య నిర్లక్ష్యంపై వచ్చిన ఆరోపణలపై ఉన్నత అధికారుల విచారణలో వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: