Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

గంజాయి రహిత కొందుర్గే లక్ష్యం.. పోలీసులంతా సమష్టిగా పనిచేయాలి! ప్రజా ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం చూపాలి.. డీసీపీ శిరీష రాఘవేంద్ర కొందుర్గు పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసిన షాద్‌నగర్‌ జోన్‌ డీసీపీ

Author
Posted By TELANGANA PRAJA GARJANA
| 30 Oct 2026, 09:10 AM | తెలంగాణ
గంజాయి రహిత కొందుర్గే లక్ష్యం.. పోలీసులంతా సమష్టిగా పనిచేయాలి!  ప్రజా ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం చూపాలి.. డీసీపీ శిరీష రాఘవేంద్ర  కొందుర్గు పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసిన షాద్‌నగర్‌ జోన్‌ డీసీపీ

కొందుర్గు, అక్టోబర్‌ 29 (తెలంగాణ ప్రజాగర్జన): గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనతో పాటు నేరాల నియంత్రణ, సైబర్‌ నేరాల కట్టడికి పోలీస్‌ సిబ్బంది సమష్టిగా కృషి చేయాలని షాద్‌నగర్‌ జోన్‌ డీసీపీ శిరీష రాఘవేంద్ర ఆదేశించారు. గురువారం ఫ్యూచర్‌ సిటీ కమిషనరేట్‌ పరిధిలోని కొందుర్గు పోలీస్‌స్టేషన్‌ను ఆమె తనిఖీ చేసి స్టేషన్‌ నిర్వహణ, సిబ్బంది పనితీరు, రికార్డులను పరిశీలించారు. పోలీస్‌స్టేషన్‌ పరిసరాలు, క్వార్టర్స్‌ పరిశుభ్రతపై ఆరా తీసి రికార్డులను ఎప్పటికప్పుడు క్రమబద్ధంగా నిర్వహించాలని సూచించారు. స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడితో మర్యాదగా వ్యవహరిస్తూ, వారి సమస్యలను ఓపికగా విని చట్టపరిధిలో తక్షణ పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు. కొందుర్గును గంజాయి రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని, గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. నిరంతర పెట్రోలింగ్‌, సీసీ కెమెరాల నిఘా, ముందస్తు చర్యలతో నేరాలను అరికట్టాలని సూచించారు. పోలీస్‌స్టేషన్‌లోని 17 పోలీస్‌ వర్టికల్స్‌ పనితీరును సమీక్షించి, సిబ్బంది బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని చెప్పారు. సీసీటీఎన్‌ఎస్‌ 2.0 వ్యవస్థను సమర్థంగా వినియోగించుకోవాలని, సైబర్‌ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. పోలీస్‌ సిబ్బంది ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, జూదం, వ్యసనపూరిత గేమ్స్‌కు దూరంగా ఉంటూ ఆర్థిక క్రమశిక్షణ, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలని హితవు పలికారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మెరుగైన పోలీస్‌ సేవలు అందించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని డీసీపీ దిశానిర్దేశం చేశారు. ఈ తనిఖీలో ఎస్‌హెచ్‌ఓ వరప్రసాద్‌, ఏఎస్ఐ ఛత్రియ, హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌, డీసీపీ కార్యాలయ రైటర్‌ రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

గంజాయి రహిత కొందుర్గే లక్ష్యం.. పోలీసులంతా సమష్టిగా పనిచేయాలి!  ప్రజా ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం చూపాలి.. డీసీపీ శిరీష రాఘవేంద్ర  కొందుర్గు పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసిన షాద్‌నగర్‌ జోన్‌ డీసీపీ - Additional Image
మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: