Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ప్రభుత్వ ఉద్యోగం పేరుతో మహిళపై అత్యాచారం

Author
Posted By TELANGANA PRAJA GARJANA
| 27 Oct 2026, 02:23 PM | క్రైమ్
ప్రభుత్వ ఉద్యోగం పేరుతో మహిళపై అత్యాచారం

ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఓ మహిళ నుంచి రూ.4.5 లక్షలు తీసుకుని, ఆమెపై అత్యాచారానికి పాల్పడిన ఘటన హైదరాబాద్‌లో వెలుగుచూసింది. మల్లాపూర్‌లోని బ్రహ్మపుత్ర కాలనీలో టైలరింగ్‌ చేస్తూ జీవనం సాగిస్తున్న 30 ఏళ్ల మహిళకు భువనగిరికి చెందిన జగన్మోహన్‌ పరిచయమయ్యాడు. తాను మున్సిపల్‌ కార్యాలయంలో శానిటరీ మేనేజర్‌గా పనిచేస్తున్నానని, ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు. ఇందుకు రూ.5 లక్షలు ఖర్చవుతాయని చెప్పడంతో బాధితురాలు రూ.4.5 లక్షలు ఇచ్చింది. అనంతరం మున్సిపల్‌ కార్యాలయానికి తీసుకెళ్తానని కారులో ఎక్కించుకున్న నిందితుడు, శ్రీనిధి రిసార్ట్‌లో ఉన్నతాధికారి ఉన్నాడని చెప్పి అక్కడికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడి, డబ్బు తీసుకుని, అనంతరం కారులో నుంచి ప్రధాన రహదారిపై పడేసి వెళ్లిపోయినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి