Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

మీ ఓటే మీ బలం.. మీ గొంతే మీ హక్కు! పట్టభద్రులంతా ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు కావాలి డాక్టర్ మెతుకు ఆనంద్ పిలుపు

Author
Posted By TELANGANA PRAJA GARJANA
| 26 Oct 2026, 07:04 PM | తెలంగాణ
మీ ఓటే మీ బలం.. మీ గొంతే మీ హక్కు!  పట్టభద్రులంతా ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు కావాలి  డాక్టర్ మెతుకు ఆనంద్ పిలుపు

తెలంగాణ ప్రజాగర్జన, వికారాబాద్, అక్టోబర్ 26: అర్హులైన పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పిలుపునిచ్చారు. వికారాబాద్ పట్టణంలోని సిద్ధార్థ పాఠశాల ఉపాధ్యాయులతో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓటరు నమోదు ప్రక్రియపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. అర్హులైన పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకునేలా ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలని, ఇతర పట్టభద్రులకు కూడా అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమని, అర్హులైన ప్రతి పట్టభద్రుడు తన ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు ముందుకు రావాలని ఆయన కోరారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: