Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం వద్దు

Author
Posted By TELANGANA PRAJA GARJANA
| 26 Oct 2026, 05:43 PM | TELANGANA, తెలంగాణ
ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం వద్దు

ప్రజావాణి అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు.

ఎల్‌నినో ప్రభావంపై ముందస్తు కార్యాచరణ సిద్ధం చేయాలి.

ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం వద్దు - Additional Image

జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి

ఇవి కూడా చదవండి

రంగారెడ్డి, తెలంగాణ ప్రజా గర్జన అక్టోబర్ 26:–

ప్రజావాణికి వచ్చే ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి ఆదేశించారు. ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా, ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 76 ఫిర్యాదులను స్వీకరించారు. ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 39, ఇతర శాఖలకు సంబంధించి 37 దరఖాస్తులు ఉన్నాయి.రానున్న రోజుల్లో ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని తాగునీటి సరఫరా, పశువుల సంరక్షణ, వైద్య శిబిరాలు, వ్యవసాయ ప్రణాళిక, విద్యుత్ సరఫరాపై సంబంధిత శాఖలు ముందస్తు కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామాలు, మున్సిపాలిటీల వారీగా తాగునీటి సమస్యలను గుర్తించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పశువులకు తాగునీరు అందుబాటులో ఉంచడంతోపాటు అవసరమైన ప్రాంతాల్లో పశువైద్య శిబిరాల నిర్వహణకు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు.రబీ సీజన్‌లో వేరుశెనగ సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. కరపత్రాలు, పోస్టర్లు, ఆడియో, వీడియో మాధ్యమాల ద్వారా వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యతకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకునేలా రైతులకు సూచనలు అందించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా, ఓవర్‌లోడ్ సమస్యలను గుర్తించి పరిష్కరించాలని, అవసరమైన మరమ్మతులు చేపట్టాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ గ్రామాలు, మున్సిపాలిటీల వారీగా కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు డాక్టర్ కె. కిరణ్మయి, చంద్ర రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మా వాట్సాప్ ఛానెల్ లో జాయిన్ అవ్వండి తాజా వార్తల కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి
Tags: