మహేశ్వరం మెడికల్ కాలేజీకి శాశ్వత భవనం నిర్మించాలి విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న మాజీ మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి
మంగళ్‌పల్లి: ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మంగళ్పల్లిలో భారత్ కాలేజీలో తాత్కాలికంగా కొనసాగుతున్న మహేశ్వరం ప్రభుత్వ మెడికల్ కాలేజీని మాజీ మంత్రులు, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు, మహేశ్వరం ఎమ్మెల్యే పి. సబితా ఇంద్రారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులతో మాట్లాడి కాలేజీలో నెలకొన్న సమస్యలు, మౌలిక వసతుల కొరతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. తాత్కాలిక భవనంలో విద్యను కొనసాగించడం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను విద్యార్థులు నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. అన్ని రకాల మౌలిక వసతులతో కూడిన శాశ్వత ప్రభుత్వ మెడికల్ కాలేజీ భవనాన్ని త్వరితగతిన నిర్మించి, మెరుగైన విద్యా వాతావరణం కల్పించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల సమస్యలను సావధానంగా...