చేగూర్‌లో స్వీట్ హౌస్ ప్రారంభం ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి హాజరు
తెలంగాణ ప్రజాగర్జన | నందిగామ, నవంబర్ 4: నందిగామ మండలం చేగూర్‌లో జై బాలాజీ రామ్‌లాల్ స్వీట్ హౌస్‌ను ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ కుమార్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ప్రొప్రైటర్ అరవింద్ మీర్జాకు శుభాకాంక్షలు తెలిపి, వినియోగదారులకు నాణ్యమైన స్వీట్లు అందిస్తూ పరిశుభ్రత పాటించాలని సూచించారు. కార్యక్రమంలో మామిళ్ల విఠల్, రాజు, బంటారం మల్లేష్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.