ఎస్ఎఫ్ఏ వేధింపులపై ఏఐటీయూసీ ధర్నా శివరాంను విధుల నుంచి సస్పెండ్ చేయాలి: వనంపల్లి జైపాల్‌రెడ్డి

తెలంగాణ ప్రజాగర్జన..కుత్బుల్లాపూర్‌: సుచిత్ర ప్రాంతంలో పారిశుద్ధ్య విధులు నిర్వహిస్తున్న మహిళా కార్మికులను వేధిస్తున్న శానిటేషన్‌ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ (ఎస్ఎఫ్ఏ) శివరాంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్‌ జోనల్‌ కార్యాలయం ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు.మహిళా కార్మికులను అసభ్య పదజాలంతో దూషిస్తూ, విధుల నిర్వహణలో ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలంగాణ మున్సిపల్‌ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వనంపల్లి జైపాల్‌రెడ్డి ఆరోపించారు. కొత్తగా విధుల్లోకి తీసుకున్న నలుగురు కార్మికుల నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.లక్ష చొప్పున వసూలు చేసినట్లు, ఈఎస్‌ఐ, ఈపీఎఫ్‌ అమలుకు అదనంగా రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు డిమాండ్‌ చేస్తున్నట్లు ఆరోపించారు. అంతేకాకుండా ప్రతి నెలా కార్మికుల నుంచి...