వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు చోరీ.. నిందితుడు అరెస్ట్‌..

వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు చోరీ.. నిందితుడు అరెస్ట్‌.. 17.160 గ్రాముల బంగారు గొలుసు, నేరానికి ఉపయోగించిన ద్విచక్ర వాహనం స్వాధీనం క్రికెట్‌ బెట్టింగ్‌ నష్టాలు, అప్పులే చోరీకి కారణమని పోలీసుల వెల్లడి. వృద్ధురాలి మెడలోని బంగారు గొలుసును అపహరించి పరారైన చైన్‌ స్నాచర్‌ను చార్మినార్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు, సైదాబాద్‌ పోలీసులతో కలిసి అరెస్ట్‌ చేశారు. నిందితుడి నుంచి 17.160 గ్రాముల బంగారు గొలుసుతో పాటు నేరానికి ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌, కొత్తపేట ప్రాంతానికి చెందిన మహమ్మద్‌ గౌస్‌ పాషా అలియాస్‌ గౌస్‌ (34) ద్విచక్ర వాహనాల మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. క్రికెట్‌ బెట్టింగ్‌లో నష్టాలు...