కొండన్నగూడలో 50 మంది విద్యార్థులకు ఉచితంగా స్పోర్ట్స్ డ్రెస్‌లు, షూస్ పంపిణీ.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అండగా దాతలు. కొండన్నగూడలో 50 మంది విద్యార్థులకు ఉచితంగా స్పోర్ట్స్ డ్రెస్‌లు, షూస్ పంపిణీ. ప్రభుత్వ విద్యతోపాటు క్రీడారంగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యం. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను ప్రోత్సహించేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ఫరూక్‌నగర్ మండలం కొండన్నగూడ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న 50 మంది విద్యార్థులకు కుమ్మరి బ్రహ్మయ్య, కమరి నవీన్ సహకారంతో ఉచితంగా స్పోర్ట్స్ డ్రెస్‌లు, షూస్ పంపిణీ చేశారు.గత ఏడాది కేవలం 12 మంది విద్యార్థులతో కొనసాగిన ఈ పాఠశాలలో ఉపాధ్యాయులు, గ్రామస్తులు, సర్పంచ్ సహకారంతో ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య 50కి చేరడం విశేషం. ప్రైవేట్ పాఠశాలల నుంచి కూడా...