గడ్డి మందుతో ప్రాణాలకు ముప్పు.. అప్రమత్తతే రక్ష.!

వ్యవసాయంలో కలుపు నివారణకు ఉపయోగించే గడ్డి మందు (పారాక్వాట్‌) అత్యంత ప్రమాదకరమైన విషపదార్థమని డాక్టర్ రామరాజు హెచ్చరించారు. ఈ మందును పొరపాటున లేదా ఆవేశంలో తీసుకుంటే శరీరంలోని కీలక అవయవాలు తీవ్రంగా దెబ్బతిని ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందని వివరించారు. ముఖ్యంగా ఊపిరితిత్తులు, కిడ్నీల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. గడ్డి మందుల వినియోగం, నిల్వ విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పురుగుమందులు, కలుపు మందులను ఎట్టి పరిస్థితుల్లోనూ తాగునీటి సీసాల్లో నిల్వ చేయకూడదని, పిల్లలకు అందుబాటులో ఉంచకూడదని పేర్కొన్నారు. ఎవరైనా పొరపాటున ఈ మందు తీసుకుంటే లక్షణాల కోసం వేచి చూడకుండా వెంటనే అత్యవసర వైద్యసహాయం పొందాలని సూచించారు. ఒక్క క్షణం...