ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదల ప్రాణాలతో చెలగాటమా? గర్భిణీ మృతి ఘటనపై సమగ్ర విచారణ జరపాలి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి: సర్పంచ్ అనూష రవీందర్‌రెడ్డి
కొండుర్గు, నవంబర్ 1 (తెలంగాణ ప్రజాగర్జన): షాద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో గర్భిణీ మహిళ మృతి చెందిన ఘటనపై మహాదేవ్‌పూర్ గ్రామ సర్పంచ్ అనూష రవీందర్‌రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు భరోసా కల్పించాల్సిన ప్రభుత్వ ఆస్పత్రులే ప్రాణాలకు ముప్పుగా మారడం బాధాకరమని అన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, నిర్లక్ష్యం వహించినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకునే ఆర్థిక స్థోమత లేని పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రులే ప్రధాన ఆధారమని పేర్కొన్నారు. అలాంటి చోట్ల వైద్య సేవల్లో నిర్లక్ష్యంపై ఆరోపణలు రావడం ఆందోళనకరమన్నారు. గర్భిణీ మహిళకు సకాలంలో వైద్య పరీక్షలు నిర్వహించారా? అవసరమైన...