చలో ఢిల్లీ.. ఓటు బచావో – దేశ్ బచావో నిరసన సభకు బయలుదేరిన కాంగ్రెస్ నాయకులు
తెలంగాణ ప్రజాగర్జన న్యూస్: ఢిల్లీలో నవంబరు 1న నిర్వహించనున్న ‘ఓటు బచావో – దేశ్ బచావో’ నిరసన సభలో పాల్గొనేందుకు తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నాయకులు ఢిల్లీకి బయలుదేరారు. రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ ఛైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్, టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, టీపీసీసీ ఎస్సీ విభాగం ఉపాధ్యక్షుడు జలపల్లి నరేందర్, నర్కూడ సర్పంచ్ గడ్డం శేఖర్ యాదవ్, కొత్వాల్‌గూడ మాజీ సర్పంచ్ లింగం యాదవ్, మాజీ కార్పొరేటర్ పాండు ముదిరాజ్ తదితరులు ఈ బృందంలో ఉన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు జై కాంగ్రెస్, జై రాహుల్ గాంధీ, జై రేవంతన్న అంటూ నినాదాలు...