రాప్తాడు పాఠశాలలో బాలికపై రంపంతో దాడి.. ధర్మవరం రైల్వే స్టేషన్‌లో నిందితుడి అరెస్ట్

రాప్తాడు పాఠశాలలో బాలికపై రంపంతో దాడి.. ధర్మవరం రైల్వే స్టేషన్‌లో నిందితుడి అరెస్ట్ ప్రేమ నిరాకరించిందనే కోపంతోనే దాడి? తరగతి గదిలో కలకలం.. మరో విద్యార్థినికి గాయాలు అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని గోపికపై జరిగిన కిరాతక దాడి ఘటనలో పోలీసులు కీలక పురోగతి సాధించారు. దాడి అనంతరం పరారైన నిందితుడు హేమంత్‌ను ధర్మవరం రైల్వే స్టేషన్‌లో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ధర్మవరం మండలం నాగలూరు గ్రామానికి చెందిన హేమంత్‌.. బాధితురాలికి సమీప బంధువుగా గుర్తించారు.పాఠశాలలో రెండో పీరియడ్ తరగతులు జరుగుతున్న సమయంలో ఎలక్ట్రిక్ రంపంతో తరగతి గదిలోకి ప్రవేశించిన నిందితుడు గోపికపై దాడికి...