చలో ఢిల్లీకి వీర్లపల్లి శంకర్ రాంలీలా మైదానంలో ఇండియా కూటమి నిరసన సభ కేంద్ర విధానాలు, ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా గళం విప్పనున్న కాంగ్రెస్ నేతలు
తెలంగాణ ప్రజాగర్జన. అక్టోబర్షా 31// షాద్‌నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల బృందం చలో ఢిల్లీ కార్యక్రమానికి బయలుదేరింది. నవంబర్ 1న న్యూఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ నిరసన సభలో పాల్గొనేందుకు నాయకులు ఢిల్లీకి పయనమయ్యారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు, ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా నిర్వహించే ఈ సభలో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొననున్నాయి.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షించడంతోపాటు కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసించేందుకు ఇండియా కూటమి చేపట్టిన పోరాటంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భాగస్వాములు...