మందుబాబు వీరంగం.. భారీ వర్షపు నీటిలో హల్చల్!
హైదరాబాద్లోని కృష్ణానగర్లో భారీ వర్షం కురిసింది. దీంతో కృష్ణానగర్ మెయిన్ రోడ్డుపై భారీగా వర్షపు నీరు ప్రవహించింది. ఈ క్రమంలో ఓ మందుబాబు వరద నీటిలో ఆడుతూ హల్చల్ చేశాడు. రోడ్డుపై నీరు ప్రవహిస్తున్నా పట్టించుకోకుండా నీటిలో ఆటలాడుతూ కనిపించాడు. వాహనాలు రాకపోకలు సాగించే ప్రధాన రహదారిపై అతడి ప్రవర్తన స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. భారీ వర్షంతో రోడ్లు జలమయమవగా, మరోవైపు మందుబాబు చేసిన హంగామా చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. వర్షపు నీటిలో ఇలాంటి నిర్లక్ష్యపు చర్యలు ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.