పట్టభద్రుల ఓటరు నమోదుకు బీఆర్ఎస్ శ్రీకారం ప్రతి గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి: రమేష్ నాయక్ కొండమల్లేపల్లిలో ప్రత్యేక నమోదు కేంద్రం ఏర్పాటు

పట్టభద్రుల ఓటరు నమోదుకు బీఆర్ఎస్ శ్రీకారం ప్రతి గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి: రమేష్ నాయక్ కొండమల్లేపల్లిలో ప్రత్యేక నమోదు కేంద్రం ఏర్పాటు కొండమల్లేపల్లి, అక్టోబర్ 30 (తెలంగాణ ప్రజాగర్జన – దేవరకొండ ప్రతినిధి సిరందాసు వెంకటేశ్వర్లు): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కొండమల్లేపల్లి అంబేద్కర్ చౌరస్తాలో ప్రత్యేక నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ నాయకులు ప్రారంభించారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకుడు రామావత్ రమేష్ నాయక్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన ఓటు హక్కు ఎంతో విలువైనదని, ముఖ్యంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతుల భాగస్వామ్యం కీలకమని అన్నారు. 2023...