ప్రజా సమస్యలపై పోరాటం.. అభివృద్ధి పనుల ప్రారంభమే లక్ష్యం.
ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ పోరుబాట.. అధికారులపై ఒత్తిడి. రాళ్లగూడలో ఎట్టకేలకు ప్రారంభమైన మురుగునీటి కాలువ పనులు.. పెండింగ్ రహదారి నిర్మాణ పనులపైనా నాయకుల దృష్టి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా శంషాబాద్ బీఆర్ఎస్ నాయకులు ప్రజల పక్షాన నిలుస్తూ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా, వాటి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో శంషాబాద్ 119వ డివిజన్ పరిధిలోని రాళ్లగూడలో ఎన్నో రోజులుగా అసంపూర్తిగా నిలిచిపోయిన మురుగునీటి కాలువ, రహదారి నిర్మాణ పనులపై బీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక దృష్టి సారించారు.రాళ్లగూడలో డ్రైనేజీ, రోడ్డు పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు....