గంజాయి రహిత కొందుర్గే లక్ష్యం.. పోలీసులంతా సమష్టిగా పనిచేయాలి! ప్రజా ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం చూపాలి.. డీసీపీ శిరీష రాఘవేంద్ర కొందుర్గు పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసిన షాద్‌నగర్‌ జోన్‌ డీసీపీ

కొందుర్గు, అక్టోబర్‌ 29 (తెలంగాణ ప్రజాగర్జన): గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనతో పాటు నేరాల నియంత్రణ, సైబర్‌ నేరాల కట్టడికి పోలీస్‌ సిబ్బంది సమష్టిగా కృషి చేయాలని షాద్‌నగర్‌ జోన్‌ డీసీపీ శిరీష రాఘవేంద్ర ఆదేశించారు. గురువారం ఫ్యూచర్‌ సిటీ కమిషనరేట్‌ పరిధిలోని కొందుర్గు పోలీస్‌స్టేషన్‌ను ఆమె తనిఖీ చేసి స్టేషన్‌ నిర్వహణ, సిబ్బంది పనితీరు, రికార్డులను పరిశీలించారు. పోలీస్‌స్టేషన్‌ పరిసరాలు, క్వార్టర్స్‌ పరిశుభ్రతపై ఆరా తీసి రికార్డులను ఎప్పటికప్పుడు క్రమబద్ధంగా నిర్వహించాలని సూచించారు. స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడితో మర్యాదగా వ్యవహరిస్తూ, వారి సమస్యలను ఓపికగా విని చట్టపరిధిలో తక్షణ పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు. కొందుర్గును గంజాయి రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణ...