ఆరు నెలలుగా ముగ్గురు అధ్యాపకుల్లేరు. ఉత్తీర్ణత సాధించేది ఎలా.?

ఆరు నెలలుగా 3 అధ్యాపకుల్లేరు. ఉత్తీర్ణత సాధించేది ఎలా.? షాద్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో AEDP విద్యార్థుల ఆవేదన మూడు సబ్జెక్టులకు బోధకుల కొరత.. పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యుడు ఆకాష్ నాయక్ ఆగ్రహం ప్రభుత్వ కళాశాలలో చేరి ఉన్నత విద్య అభ్యసించాలనే పేద విద్యార్థుల ఆశలకు అధ్యాపకుల కొరత అడ్డంకిగా మారుతోంది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ఫార్మాస్యూటికల్స్ మాన్యుఫాక్చరింగ్ అండ్ క్వాలిటీ (AEDP) కోర్సు చదువుతున్న విద్యార్థులు బోధకులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోర్సు ప్రారంభమైనప్పటి నుంచి సుమారు ఆరు నెలలు గడుస్తున్నా కీలక సబ్జెక్టులకు అధ్యాపకులను నియమించలేదని విద్యార్థులు ఆవేదన...