శంషాబాద్‌కు కరువు మండల హోదా.. రైతులకు ఊరట! ఎమ్మెల్యే ప్రకాష్‌ గౌడ్‌కు అనేగౌని శ్రీకాంత్‌ గౌడ్‌ కృతజ్ఞతలు

రాజేంద్రనగర్‌, అక్టోబర్‌ 29(తెలంగాణ రాజాగర్జన: శంషాబాద్‌ మండలాన్ని ప్రభుత్వం కరువు మండలంగా ప్రకటించడం పట్ల నార్సింగి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ అనేగౌని శ్రీకాంత్‌ గౌడ్‌ హర్షం వ్యక్తం చేశారు. కరువు మండలాల జాబితాలో శంషాబాద్‌కు చోటు కల్పించడంతో రైతులకు ఎంతో ఉపశమనం కలుగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే టీ. ప్రకాష్‌ గౌడ్‌ను కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మండలంలో నెలకొన్న కరువు పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం రైతులకు ప్రయోజనకరమన్నారు. ఎల్‌నినో ప్రభావంతో పాటు ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కరువు మండలంగా గుర్తింపు లభించడంతో రైతులకు ప్రభుత్వ సహాయక చర్యలు,...