ఒడిశా నుంచి గంజాయి సరఫరా.. హైదరాబాద్‌లో 13 కిలోలు పట్టివేత

ఒడిశా నుంచి గంజాయి సరఫరా.. హైదరాబాద్‌లో 13 కిలోలు పట్టివేత టాస్క్‌ఫోర్స్, బోరబండ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌.. ఒకరి అరెస్ట్ నగరంలో గంజాయి అక్రమ విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. కమిషనర్ టాస్క్‌ఫోర్స్‌ (జూబ్లీహిల్స్‌ జోన్‌), బోరబండ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో 13 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని మహమ్మద్ అయాజ్‌ అలియాస్‌ నిస్సార్‌ అలియాస్‌ బ్యాండ్‌ (28)ను అరెస్ట్‌ చేశారు.పోలీసుల వివరాల ప్రకారం.. యూసుఫ్‌గూడ శ్రీరామ్‌నగర్‌కు చెందిన అయాజ్‌ ఏసీ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో అక్రమంగా డబ్బు సంపాదించేందుకు గంజాయి విక్రయాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఒడిశాలోని ఖోర్ధా జిల్లా తంగి గ్రామానికి చెందిన సరఫరాదారు నుంచి ఏడాదిగా...