కాటేదాన్లో భారీ కెమికల్ పేలుడు.. ముగ్గురికి గాయాలు
హైదరాబాద్ శివార్లలోని కాటేదాన్ పారిశ్రామిక ప్రాంతంలో మంగళవారం ప్లాస్టిక్ బాటిళ్ల తయారీ కంపెనీలో భారీ కెమికల్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో సాయికి తీవ్ర గాయాలవడంతో పరిస్థితి విషమంగా మారింది. మరో ఇద్దరు కూడా గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడుకు గల కారణాలు, భద్రతా ప్రమాణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.