బీసీలకు అన్యాయం.. అగ్రవర్ణాలకు వరాలా? ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లపై బీసీ సంఘాల నిరసన

మంచిర్యాల జిల్లా ప్రతినిధి, అక్టోబర్‌ 27 (తెలంగాణ ప్రజాగర్జన):ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లను రద్దు చేసి బీసీలకు విద్య, ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మంగళవారం మంచిర్యాల కార్పొరేషన్‌ పరిధిలోని ముల్కల్లలో అంబేద్కర్‌ విగ్రహం వద్ద ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. 1992లో ఇంద్రా సాహ్నీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లపై అభ్యంతరాలు ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం 2019లో 103వ రాజ్యాంగ సవరణ ద్వారా అగ్రవర్ణాల్లోని ఆర్థికంగా బలహీన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించిందని పేర్కొన్నారు. దశాబ్దాలుగా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు...