పండుగ వేళ పారిశుద్ధ్య కార్మికులకు మార్వాడి సమాజం అండ! షాద్నగర్లో దసరా, దీపావళి కానుకగా దుస్తుల పంపిణీ
తెలంగాణ ప్రజాగర్జన //షాద్నగర్ పట్టణంలో సమాజం కోసం నిరంతరం శ్రమించే పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాల్లో పండుగ ఆనందాలు నింపేందుకు రాజస్థాన్ మార్వాడి సమాజం ముందుకొచ్చింది. దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని షాద్నగర్ మున్సిపాలిటీ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, ఏసీపీ లక్ష్మీనారాయణ, పట్టణ సీఐ సీతారాం హాజరై కార్మికులకు దుస్తులు అందజేశారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్ మాట్లాడుతూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణలో పారిశుద్ధ్య కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ప్రతిరోజూ ఉదయం నుంచే విధుల్లో నిమగ్నమవుతూ వీధులు, కాలనీలు, ప్రధాన రహదారులను శుభ్రంగా ఉంచేందుకు...