హైదరాబాద్‌లో ఈగిల్ ఫోర్స్ మెరుపు దాడి.. 75 ఏళ్ల వృద్ధురాలు అరెస్ట్
ఇంట్లోనే గంజాయి దందా.. 75 ఏళ్ల వృద్ధురాలు అరెస్ట్. 70 మంది వినియోగదారుల గుర్తింపు.. 66 మందికి టీజీహెచ్‌సీ పాజిటివ్ హైదరాబాద్ నగరంలో మాదకద్రవ్యాల అక్రమ విక్రయాలపై తెలంగాణ ఈగిల్ ఫోర్స్ ఉక్కుపాదం మోపింది. ఫతేనగర్ పరిధిలోని ఎల్‌బీఎస్ నగర్‌లో ఓ నివాస గృహాన్ని కేంద్రంగా చేసుకుని సాగుతున్న గంజాయి దందాను పోలీసులు బట్టబయలు చేశారు. ఇంట్లోనే గంజాయిని నిల్వ ఉంచి చిన్నచిన్న పొట్లాలుగా విక్రయిస్తున్న 75 ఏళ్ల షేక్ జథేన్ బీని అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో ముగ్గురు మైనర్లు సహా సుమారు 70 మంది వినియోగదారులను గుర్తించడం కలకలం రేపింది.విశ్వసనీయ సమాచారం మేరకు ఈగిల్ ఫోర్స్‌కు చెందిన హైదరాబాద్ నార్కోటిక్ పోలీస్ స్టేషన్...