ఓటు హక్కును కాపాడుకోవాలి మోహన్‌ కుమారన్‌ మంగళం నవంబర్‌ 1న ఢిల్లీలో భారీ సభ.. కాంగ్రెస్‌ శ్రేణులు తరలిరావాలి

తెలంగాణ ప్రజాగర్జన, మొయినాబాద్‌, అక్టోబర్‌ 26: ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు హక్కును కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యతని ఏఐసీసీ పరిశీలకుడు మోహన్‌ కుమారన్‌ మంగళం అన్నారు. మొయినాబాద్‌లోని కాంగ్రెస్‌ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షురాలు చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి అధ్యక్షతన, చేవెళ్ల కాంగ్రెస్‌ ఇన్‌చార్జి పామేన భీమ్‌ భరత్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ఓట్‌ బచావో–దేశ్‌ బచావో’ కార్యక్రమంతో ప్రజల్లో ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. నవంబర్‌ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలకు పారిజాత నర్సింహారెడ్డి, భీమ్‌ భరత్‌ పిలుపునిచ్చారు. సమావేశంలో పరిశీలకుడు అఫ్సర్‌ జేసోషీ, రాష్ట్ర కార్పొరేషన్‌ చైర్మన్లు...