800 బాంబు బెదిరింపులు.. చెన్నైలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అరెస్ట్

800 బాంబు బెదిరింపులు.. చెన్నైలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అరెస్ట్ శంషాబాద్, అక్టోబర్ 26: దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో తీవ్ర భయాందోళనలు సృష్టించిన నకిలీ బాంబు బెదిరింపుల వ్యవహారంలో ప్రధాన నిందితుడిని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైకి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శరత్ సుబ్రహ్మణ్యాన్ని ప్రత్యేక బృందాలు అక్కడ అదుపులోకి తీసుకున్నాయి. దేశంలోని వివిధ విమానాశ్రయాలకు సుమారు 800 నకిలీ బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ పంపినట్లు దర్యాప్తులో వెల్లడైంది. పోలీసుల వివరాల ప్రకారం.. తమిళనాడులోని డీఎంకే పార్టీ నాయకులపై ఉన్న వ్యక్తిగత కక్షతో నిందితుడు ఈ చర్యలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. విమానాశ్రయాలకు బాంబు బెదిరింపు మెయిల్స్ పంపి, ఆ నేరాన్ని డీఎంకే నేతలపై నెట్టి...