తొండుపల్లి చెరువులోకి మురుగునీరు! జలవనరులకు ముప్పు.. కాలుష్యంపై విచారణ ఏదీ? గోదాములు, పరిసర ప్రాంతాల వ్యర్థజలాలపై ఆందోళన వ్యక్తం చేసిన తెలంగాణ రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యదర్శి బైతి శ్రీధర్
శంషాబాద్, అక్టోబర్ 25: శంషాబాద్ పరిధిలోని తొండుపల్లి చెరువులోకి మురుగునీరు చేరుతోందన్న ఆరోపణలపై అధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యదర్శి బైతి శ్రీధర్ కోరారు. సమీప గ్రామాలు, ప్రైవేటు గోదాముల నుంచి వెలువడే వ్యర్థజలాలు చెరువులోకి చేరుతున్నాయన్న ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే చెరువు నీటి నాణ్యత దెబ్బతినడంతో పాటు పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలపై ప్రభావం పడే ప్రమాదం ఉందని అన్నారు. చెరువులు భూగర్భ జలాల పెరుగుదలకు, వ్యవసాయ అవసరాలకు కీలకమైన వనరులని, వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని పేర్కొన్నారు. గతంలో సమీపంలోని కాముని చెరువులో మురుగునీరు చేరిన...