🏠 telanganaprajagarjana.com
Watermark
Clip Header Logo
Date of Publish : 02 November 2026, 3:18 pm Posted by : TELANGANA PRAJA GARJANA

కొండన్నగూడలో 50 మంది విద్యార్థులకు ఉచితంగా స్పోర్ట్స్ డ్రెస్‌లు, షూస్ పంపిణీ.

News Image
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అండగా దాతలు.
కొండన్నగూడలో 50 మంది విద్యార్థులకు ఉచితంగా స్పోర్ట్స్ డ్రెస్‌లు, షూస్ పంపిణీ.
ప్రభుత్వ విద్యతోపాటు క్రీడారంగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యం.

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను ప్రోత్సహించేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ఫరూక్‌నగర్ మండలం కొండన్నగూడ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న 50 మంది విద్యార్థులకు కుమ్మరి బ్రహ్మయ్య, కమరి నవీన్ సహకారంతో ఉచితంగా స్పోర్ట్స్ డ్రెస్‌లు, షూస్ పంపిణీ చేశారు.గత ఏడాది కేవలం 12 మంది విద్యార్థులతో కొనసాగిన ఈ పాఠశాలలో ఉపాధ్యాయులు, గ్రామస్తులు, సర్పంచ్ సహకారంతో ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య 50కి చేరడం విశేషం. ప్రైవేట్ పాఠశాలల నుంచి కూడా పలువురు విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.విద్యార్థుల అభ్యున్నతితోపాటు క్రీడారంగంలోనూ వారు రాణించాలనే ఉద్దేశంతో దాతలు స్పోర్ట్స్ డ్రెస్‌లు, షూస్ అందజేశారు. గత కొన్ని సంవత్సరాలుగా నోట్‌బుక్స్, బ్యాగులు, పెన్నులు, స్పోర్ట్స్ డ్రెస్‌లు పంపిణీ చేస్తూ విద్యార్థులకు అండగా నిలుస్తున్నట్లు తెలిపారు. గ్రామ అభివృద్ధిలో భాగంగా పాఠశాలకు అవసరమైన సదుపాయాలు, టేబుళ్లు, గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు కూడా సహకారం అందించినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ విద్యార్థులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ముందుంటామని తెలిపారు.ఈ సందర్భంగా విద్యార్థుల విద్యాభివృద్ధికి, గ్రామ ప్రగతికి తమ వంతు సహకారం అందిస్తున్న కుమ్మరి బ్రహ్మయ్య, కమరి నవీన్‌లను గ్రామస్తులు ప్రత్యేకంగా అభినందించి శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దుర్గారావు, నూకరాజు, గ్రామ కార్యదర్శి నాగమణి, స్కూల్ చైర్మన్ ఈశ్వరమ్మ, సర్పంచ్ అనురాధ సురేష్ గౌడ్, ఉపసర్పంచ్ నరసింహులు యాదవ్, మాజీ సర్పంచ్ వై. శ్రీనివాస్ యాదవ్, మాజీ ఉపసర్పంచ్ జై ఆంజనేయులు గౌడ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
🏠 Home