ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ మహా సభా
ముఖ్యమైన పాయింట్స్:కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వాకిటి శ్రీహరి , తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేతలు, డిసిసి అధ్యక్షులు, పార్టీ ముఖ్య నాయకులు
నవంబర్ 1 , మక్తల్ (తెలంగాణ ప్రజా గర్జన)
ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఏఐసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ భారీ బహిరంగ సభకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం గళమెత్తిన మంత్రి వాకిటి శ్రీహరి, తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేతలు, డిసిసి అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, టీపీసీసీ నాయకులు, పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఓటర్ల జాబితాలో అవకతవకలు, SIR ప్రక్రియలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని, ఓటర్ల హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన ఈ సభలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పాల్గొని తమ నిరసనను తెలియజేశారు. ఓట్ల చోరీకి సంబంధించిన ఆరోపణలపై సమగ్ర, నిష్పక్షపాత విచారణ జరపాలని, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని, ప్రతి ఓటరుకు తన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునే అవకాశం కల్పించాలని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటు హక్కు పునాది వంటిదని, ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం నిలబెట్టేందుకు పారదర్శకమైన ఎన్నికల విధానాలు అవసరమని కోరారు .రాహుల్ గాంధీ నాయకత్వంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
తెలంగాణ కాంగ్రెస్‌కు చెందిన రాష్ట్ర స్థాయి నాయకులు, మంత్రివర్యులు, టీపీసీసీ జనరల్ సెక్రటరీలు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఒకే వేదికపై పాల్గొనడం ఈ మహా సభలో ప్రత్యేకతగా నిలిచింది.