🏠 telanganaprajagarjana.com
Watermark
Clip Header Logo
Date of Publish : 01 November 2026, 6:32 pm Posted by : TELANGANA PRAJA GARJANA

ఘనంగా మంత్రి వాకిటి శ్రీహరి జన్మదిన వేడుకలు

News Image
తెలంగాణ రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి జన్మదినాన్ని పురస్కరించుకుని నర్వ మండల కేంద్రంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.

నవంబర్ - 1 , మక్తల్ (తెలంగాణ ప్రజా గర్జన)

నర్వ మండలంలో శ్రీ ఉమా మహేశ్వర స్వామి దేవాలయంలో నర్వ గ్రామ సర్పంచ్ హన్మంత్ రెడ్డి మంత్రి జన్మదిన సందర్భంగా ప్రత్యేక పూజలు జరిపించి, భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించరు. దాని అనంతరం రైతు వేదికలో మండల అధ్యక్షుడు బీసం చెన్నయ్య సాగర్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి మంత్రి జన్మదిన వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఆత్మకూర్ మార్కెట్ వైస్ చైర్మన్ కృష్ణారెడ్డి, మండల నాయకులు జగదాభి రెడ్డి, శరణప్ప,నర్వ గ్రామ అధ్యక్షుడు ఆంజనేయ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, గ్రామ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home