🏠 telanganaprajagarjana.com
Watermark
Clip Header Logo
Date of Publish : 01 November 2026, 3:16 pm Posted by : TELANGANA PRAJA GARJANA

గ్రామ ప్రజల సౌకర్యార్థం బోర్ మోటార్ అందజేత రవీందర్ యాదవ్ ఔదార్యం.. బోర్ మోటార్‌ను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్

News Image
తెలంగాణ ప్రజాగర్జన. షాద్ నగర్.ఫరూక్ నగర్ మండలం లోని దేవునిపల్లి గ్రామ ప్రజల నీటి అవసరాలను గుర్తించిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రవీందర్ యాదవ్ తన సొంత సహకారంతో గ్రామానికి బోర్ మోటార్‌ను అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ బోర్ మోటార్‌ను ప్రారంభించారు.గ్రామ ప్రజల సౌకర్యార్థం ముందుకొచ్చి బోర్ మోటార్ అందజేసిన రవీందర్ యాదవ్‌ను పలువురు అభినందించారు. ప్రజల అవసరాలను గుర్తించి సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావడం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మణ్ నాయక్, సర్పంచ్ గీత వీరేశం, మాజీ సర్పంచ్ రవి గౌడ్, నాయకులు నగరం శ్రీనివాస్, యాదయ్య, కుమార్, గోవిందు, నర్సింలు, రామకృష్ణ, చెన్న రాములు, పి. మల్లయ్య, పెంటయ్య, మహేష్, బి. రమేష్, జి. శ్రీనివాస్, శివ, రామయ్య తదితరులు పాల్గొన్నారు.
🏠 Home