🏠 telanganaprajagarjana.com
Watermark
Clip Header Logo
Date of Publish : 01 November 2026, 12:40 pm Posted by : TELANGANA PRAJA GARJANA

ఘనంగా మంత్రి గారి జన్మదిన వేడుకలు

News Image
*ఘనంగా మంత్రి గారి జన్మదిన వేడుకలు*

మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయం నందు గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక 15వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి కోళ్ళ సంధ్య వెంకటేష్ గారి ఆధ్వర్యంలో పూజా అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది . అనంతరం కేక్ కటింగ్ తో మంత్రిగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ , తమ సంతోషాని వ్యక్తపరచారు .

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కౌన్సిలర్ శ్రీమతి కోళ్ళ సంధ్య వెంకటేష్ గారు మాట్లాడుతూ... మంత్రి గారు రాష్ట్ర అభివృద్ధి కోసం, పేద ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారన్ని , వారి నాయకత్వంలో మక్తల్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్ని పెరుకొన్నారు. వారు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు .

ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎం.పీ.టీ.సీ కోళ్ళ వెంకటేష్ , తిరుపతి నరసింహులు , మామిళ్ళ కిష్టప్ప , మామిళ్ళ కృష్ణ , చీరాల నరసింహమూర్తి , మంగళ కృష్ణ , కావలి అంజప్ప , కుమ్మరి ఆంజనేయులు , బోయ వెంకటేష్ , కావలి వెంకటేష్ , కావలి రవి కిరణ్ , బూడిదిపాడు అంజప్ప , పూజారి నర్సప్ప , కురువ సాబెన్న , కావాలి ఆశప్ప మరి తదితరులు పాల్గొన్నారు .
🏠 Home