🏠 telanganaprajagarjana.com
Watermark
Clip Header Logo
Date of Publish : 01 November 2026, 12:10 pm Posted by : TELANGANA PRAJA GARJANA

గడ్డి మందుతో ప్రాణాలకు ముప్పు.. అప్రమత్తతే రక్ష.!

News Image
వ్యవసాయంలో కలుపు నివారణకు ఉపయోగించే గడ్డి మందు (పారాక్వాట్‌) అత్యంత ప్రమాదకరమైన విషపదార్థమని డాక్టర్ రామరాజు హెచ్చరించారు. ఈ మందును పొరపాటున లేదా ఆవేశంలో తీసుకుంటే శరీరంలోని కీలక అవయవాలు తీవ్రంగా దెబ్బతిని ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందని వివరించారు. ముఖ్యంగా ఊపిరితిత్తులు, కిడ్నీల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు.
గడ్డి మందుల వినియోగం, నిల్వ విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పురుగుమందులు, కలుపు మందులను ఎట్టి పరిస్థితుల్లోనూ తాగునీటి సీసాల్లో నిల్వ చేయకూడదని, పిల్లలకు అందుబాటులో ఉంచకూడదని పేర్కొన్నారు. ఎవరైనా పొరపాటున ఈ మందు తీసుకుంటే లక్షణాల కోసం వేచి చూడకుండా వెంటనే అత్యవసర వైద్యసహాయం పొందాలని సూచించారు.
ఒక్క క్షణం నిర్లక్ష్యం కుటుంబంలో తీరని విషాదాన్ని నింపవచ్చని, ప్రతి రైతు ఈ ప్రమాదంపై అవగాహన కలిగి ఉండాలని డాక్టర్ రామరాజు సూచించారు. ఈ సమాచారాన్ని ప్రతి గ్రామానికి, ప్రతి రైతు కుటుంబానికి చేరవేయడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని, ఒకరి అవగాహన మరొకరి ప్రాణాన్ని కాపాడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
🏠 Home