పెంజర్లలో బీఎస్ఎన్ఎల్ ఓఎఫ్‌సీ కేబుల్ ధ్వంసం.. కాంట్రాక్టర్‌పై కేసు

షాద్‌నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలం పెంజర్ల గ్రామ పరిధిలో బీఎస్ఎన్ఎల్‌కు చెందిన ఆప్టికల్ ఫైబర్ (OFC) కేబుల్‌ను ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా కట్ చేసిన ప్రైవేట్ గ్యాస్ కనెక్షన్ కాంట్రాక్టర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. గ్యాస్ పైప్‌లైన్, కనెక్షన్ పనులు నిర్వహించే క్రమంలో సంబంధిత వ్యక్తి బీఎస్ఎన్ఎల్‌కు చెందిన కీలకమైన ఫైబర్ కేబుల్‌ను అనధికారికంగా కట్ చేయడంతో టెలికాం నెట్‌వర్క్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో బీఎస్ఎన్ఎల్ సేవలకు నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది.ఈ ఘటనపై బీఎస్ఎన్ఎల్ షాద్‌నగర్ అధికారులు తీవ్రంగా స్పందించారు. సంబంధిత కాంట్రాక్టర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ అక్టోబర్ 29న కొత్తూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు వ్యక్తిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.ప్రభుత్వ టెలికాం సంస్థకు చెందిన కీలకమైన ఓఎఫ్‌సీ కేబుళ్లను అనుమతి లేకుండా తవ్వకాల ద్వారా దెబ్బతీయడం చట్టరీత్యా నేరమని బీఎస్ఎన్ఎల్ అధికారులు హెచ్చరించారు. ప్రైవేట్ గ్యాస్ కనెక్షన్లు, పైప్‌లైన్ పనులు, రోడ్డు తవ్వకాలు చేపట్టే కాంట్రాక్టర్లు తప్పనిసరిగా సంబంధిత శాఖల అనుమతులు తీసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బీఎస్ఎన్ఎల్ కేబుళ్లకు నష్టం కలగకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేశారు.