🏠 telanganaprajagarjana.com
Watermark
Clip Header Logo
Date of Publish : 31 October 2026, 6:54 am Posted by : TELANGANA PRAJA GARJANA

సాహసోపేతంగా కాపాడిన DRF, MRT సిబ్బంది బాధితుడిని పరామర్శించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్.. క్షేత్రస్థాయిలో వరద ప్రాంతాల పరిశీలన

News Image
వరదలో చిక్కుకున్న వ్యక్తికి హైడ్రా బృందాల రక్షణ

50 మీటర్ల దూరం పైపులో కొట్టుకుపోయిన వ్యక్తి.. సాహసోపేతంగా కాపాడిన DRF, MRT సిబ్బంది

బాధితుడిని పరామర్శించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్.. క్షేత్రస్థాయిలో వరద ప్రాంతాల పరిశీలన

మాదాపూర్, అక్టోబర్ 31 (తెలంగాణ ప్రజాగర్జన): భారీ వర్షంతో వరద ఉధృతికి కొట్టుకుపోతున్న వ్యక్తిని హైడ్రా DRF, MRT బృందాలు సాహసోపేతంగా రక్షించాయి. శుక్రవారం రాత్రి మాదాపూర్‌లోని విఠల్‌రావు నగర్, దుర్గం చెరువు సమీపంలో ఫుడ్ డెలివరీ చేసేందుకు ఎలక్ట్రిక్ మోపెడ్‌పై వెళ్తున్న అర్జున్ కిషోర్ (45) వరద నీటి ప్రవాహానికి అదుపుతప్పి కాలువలో పడిపోయాడు. ఇటీవల ఎస్‌ఎన్‌డీపీ పనుల్లో భాగంగా నిర్మించిన భూగర్భ పైపులైన్‌లో సుమారు 50 మీటర్ల దూరం కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న హైడ్రా DRF, MRT సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి టార్చ్‌లైట్ల సహాయంతో పైపులో గాలించి అతడిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ప్రాణాపాయం నుంచి బయటపడిన బాధితుడు హైడ్రా సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపాడు.సమాచారం అందుకున్న హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధితుడు అర్జున్ కిషోర్‌తో మాట్లాడి అతడి ఆరోగ్య పరిస్థితి, రక్షించిన తీరును తెలుసుకున్నారు. అంతకుముందు మాదాపూర్‌లోని నీరూస్ షోరూమ్, భారత్ పెట్రోల్ బంక్ ప్రాంతాలతో పాటు దుర్గం చెరువు పరిసరాల్లో పర్యటించి వర్షపు నీరు నిలిచిన ప్రాంతాలను పరిశీలించారు. వరద నీటి కారణంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
🏠 Home