🏠 telanganaprajagarjana.com
Watermark
Clip Header Logo
Date of Publish : 30 October 2026, 1:23 pm Posted by : TELANGANA PRAJA GARJANA

పట్టభద్రుల ఓటరు నమోదుకు బీఆర్ఎస్ శ్రీకారం ప్రతి గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి: రమేష్ నాయక్ కొండమల్లేపల్లిలో ప్రత్యేక నమోదు కేంద్రం ఏర్పాటు

News Image
పట్టభద్రుల ఓటరు నమోదుకు బీఆర్ఎస్ శ్రీకారం

ప్రతి గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి: రమేష్ నాయక్

కొండమల్లేపల్లిలో ప్రత్యేక నమోదు కేంద్రం ఏర్పాటు

కొండమల్లేపల్లి, అక్టోబర్ 30 (తెలంగాణ ప్రజాగర్జన – దేవరకొండ ప్రతినిధి సిరందాసు వెంకటేశ్వర్లు): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కొండమల్లేపల్లి అంబేద్కర్ చౌరస్తాలో ప్రత్యేక నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ నాయకులు ప్రారంభించారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకుడు రామావత్ రమేష్ నాయక్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన ఓటు హక్కు ఎంతో విలువైనదని, ముఖ్యంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతుల భాగస్వామ్యం కీలకమని అన్నారు. 2023 డిసెంబర్ నాటికి డిగ్రీ పూర్తి చేసిన అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, గ్రామాల్లోని విద్యావంతులకు కూడా ఓటరు నమోదు ప్రాధాన్యతను వివరించాలని సూచించారు. నిరుద్యోగ యువత, ఉద్యోగుల సమస్యలు, విద్యావ్యవస్థలో మార్పులు, పట్టభద్రుల హక్కులను చట్టసభల్లో వినిపించేందుకు ఓటు హక్కు ఒక ముఖ్యమైన సాధనమని పేర్కొన్నారు. ప్రతి పట్టభద్రుడు తన ఓటు హక్కును నమోదు చేసుకుని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్దిశెట్టి సత్యం, చింతకుంట్ల సర్పంచ్ కావటి వెంకటేష్, దాచేపల్లి నరేందర్, శేఖర్ యాదవ్, బోడ యాదగిరి, రజినీకాంత్, మూడవత్ పాండు నాయక్, నేనావత్ శంకర్ నాయక్, కోర్ర భీమా నాయక్, రావుల సత్యనారాయణ, రామాంజనేయ చారి, లక్ష్మణ్ నాయక్, గౌస్ పాషా, యాదయ్య, శ్రీను, శంకర్, ఆజీజ్ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home